
ముషీరాబాద్, వెలుగు: బీజేపీ సీనియర్ నేత ఫ్రపుల్ రాంరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బుధవారం చిక్కడపల్లిలోని తన ఆఫీసులో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపించినట్లు తెలిపారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముషీరాబాద్ సెగ్మెంట్ పరిధిలోని డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్ల గెలుపు కోసం ఎంతో కృషిచేసినట్లు ఆయన చెప్పారు. బీజేపీలో ఉంటే సరైన న్యాయం జరగదని భావించి రాజీనామా చేశానన్నారు. మరో రెండ్రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన తెలిపారు.