చిదంబరానికి కోల్కతాలో చేదు అనుభవం

చిదంబరానికి కోల్కతాలో చేదు అనుభవం
  • టీఎంసీ కేసు వాదించడానికి కోల్కతా హైకోర్టుకు చిదంబరం
  • చిదంబరానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ లాయర్ల నిరసన

కోల్కతా: కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ లాయర్ చిదంబరానికి చేదు అనుభవం ఎదురైంది. అధికార టీఎంసీ పార్టీ తరఫున వాదించడానికి బుధవారం చిదంబరం కోల్కతా హైకోర్టుకు వచ్చారు. అయితే  ఆయన వస్తున్నారన్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సెల్ కు చెందిన కొంత మంది లాయర్లు హైకోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. చిదంబరం రాగానే గో బ్యాక్ అంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడై ఉండి... పక్క పార్టీల కోసం ఎలా పని చేస్తారని వారంతా ఆయనను చుట్టుముట్టారు. చిదంబరం టీఎంసీ మద్ధతుదారుడని, ఆయన లాంటి వారి వల్లే దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఆరోపించారు. 

మరిన్ని వార్తల కోసం...

స్టూడెంట్లతో రాహుల్ ఇంటరాక్షన్ కు పర్మిషన్ ఇవ్వండి

ఆ ఊరిలో 100కి పైగా ఆలయాలు