శంకరన్ సేవలు మరువలేం.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్

శంకరన్ సేవలు మరువలేం.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్

గచ్చిబౌలి, వెలుగు: సామాజిక న్యాయానికి ప్రతీక ఎస్‌‌‌‌.ఆర్‌‌‌‌.శంకరన్ అని, దేశంలోని అత్యున్నత సేవా తపన కలిగిన సీనియర్‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌ అధికారిగా సేవలు అందించారని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్​కుమార్​ కొనియాడారు. 

బుధవారం ఎస్‌‌‌‌.ఆర్‌‌‌‌.శంకరన్ జయంతి సందర్భంగా గౌలిదొడ్డి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీలో ఆయన స్టూడెంట్స్​తో మమేకమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలు, దళితులు, గిరిజనులు, బడుగు వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు శంకరన్ అహర్నిశలు శ్రమించారని గుర్తు చేశారు. దళితుల సంక్షేమం కోసం ప్రత్యేక హాస్టల్ వ్యవస్థను ప్రారంభించారని, గురుకుల విద్యకు పునాది వేశారని తెలిపారు. శంకరన్​ కన్న కలలను కాంగ్రెస్​ ప్రభుత్వం సాకారం చేస్తోందని చెప్పారు.