కేసీఆర్ పాలనలో అణిచివేత, విధ్వంసం : పాశం యాదగిరి

కేసీఆర్ పాలనలో అణిచివేత, విధ్వంసం : పాశం యాదగిరి
  • సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి

ఖైరతాబాద్,వెలుగు :  తెలంగాణలో గత పదేళ్లలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో  ప్రశ్నించే వారిపై కేసులు పెట్టారని, వ్యవసాయ రంగం పూర్తిగా నాశనమైందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ' సేవ్ డెమోక్రసీ,  పేరుతో  సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో  సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చాక జరిగిన విధ్వంసం, అణిచివేత, అన్యాయానికి గురైన బాధితులపై నివేదిక తయారు చేసి దానిని కేంద్ర పెద్దలు, ఏఐసీసీ నేతలు

 ఇతర పార్టీ పెద్దలకు ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్( ఏఐడబ్ల్యుజేయూ ) ప్రతినిధి బృందం  అందజేసినట్టు తెలిపారు.  కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో అగ్రికల్చర్ పాలసీ తీసుకురావాలని, ఉపాధి కల్పించే పరిశ్రమలను స్థాపించాలని సూచించారు. ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్  జాతీయ అధ్యక్షుడు కె.  కోటేశ్వరరావు, అంబు రాథోడ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడారు. ఈ నెల 22న  గన్ పార్క్ నుంచి  జర్నలిస్టు ర్యాలీ జరుగుతుందని కోటేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలోని జర్నలిస్టులందరూ పాల్గొవాలని కోరారు.