
సీనియర్ జర్నలిస్ట్…రేవతిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు బంజారాహిల్స్ పోలీసులు. గతంలో తనను స్టూడియోలో అవమానించారంటూ రేవతిపై కేసు పెట్టారు దళిత నాయకుడు హమారా ప్రసాద్. ఈ కేసులో రేవతి ఏ2 గా ఉన్నారు. కేసు నమోదైన చాలా రోజుల తర్వాత ఇవాళ ఉదయం మణికొండలోని రేవతి నివాసానికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తనను ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు రేవతి.