V6 News

 కాంగ్రెస్ పార్టీని వీడిన పీసీ చాకో

 కాంగ్రెస్ పార్టీని వీడిన పీసీ చాకో

కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. సీనియర్ నేత పీసీ చాకో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. దీనికి సంబంధించి తన రాజీనామా లేఖను సోనియాకు పంపినట్లు పీసీ చాకో తెలిపారు. పార్టీని వీడుతూ ఆయన కాంగ్రెస్ హైకమాండ్‌పై పలు ఆరోపణలు చేశారు. ప్రెసిడెంట్ లేకుండా ఏడాదిగా పార్టీ నడుస్తోందని.. కాంగ్రెస్‌లో నాయకత్వమే లోపించిందని ఆరోపించారు. అటు పార్టీలో అసలు ప్రజాస్వామ్యమే లేదని, కేరళలో రెండు వర్గాలు తప్ప అసలు పార్టీయే లేదన్నారు. కేరళలో రెండు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని, అవి కాంగ్రెస్(ఐ), కాంగ్రెస్ (ఎ) అని.. ఈ రెండు పార్టీల సమన్వయ కమిటీ కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. మరోవైపు తాను బీజేపీలో చేరుతున్నానని మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు చాకో.