V6 News

Kara Movie Review: బాక్సాఫీస్ వద్ద ధనుష్ విశ్వరూపం.. 'కర' మూవీ ఎలా ఉందంటే?

Kara Movie Review: బాక్సాఫీస్ వద్ద ధనుష్ విశ్వరూపం.. 'కర' మూవీ ఎలా ఉందంటే?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'కర'. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఈ రోజు (  ఏప్రిల్ 30, 2026)  థియేటర్లలోకి వచ్చి, బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది.  తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించింది. 'పోర్ త్రిజిల్' వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు విఘ్నేష్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రం, అంచనాలను ఏమాత్రం తగ్గకుండా ఆకట్టుకుంటోంది.

కథా నేపథ్యం

ఈ సినిమా 1991 నాటి గల్ఫ్ యుద్ధం , అప్పట్లో నెలకొన్న చమురు సంక్షోభం నేపథ్యంలో సాగుతుంది. ఒక గ్రామీణ క్రైమ్ డ్రామాగా మొదలై, హై-వోల్టేజ్ బ్యాంక్ హీస్ట్ (దోపిడీ) థ్రిల్లర్‌గా మారుతుంది. తండ్రి-కొడుకుల మధ్య ఉండే భావోద్వేగ బంధం , ఒక విలక్షణమైన సామాజిక సమస్య చుట్టూ కథ తిరుగుతుంది. ఒక సామాన్యుడు వ్యవస్థపై తిరుగుబాటు చేసి బ్యాంక్ దోపిడీకి ఎందుకు పాల్పడాల్సి వచ్చింది? అందులో ఎదురైన సవాళ్లు ఏమిటి? అనేదే 'కర' ప్రధానాంశం.

ALSO READ : సెగ తగులుతోంది.. ఎవరు చూస్తున్నారో తెలియడం లేదు..

ఎలా ఉందంటే?

దర్శకుడు విఘ్నేష్ రాజా తన మొదటి సినిమా 'పోర్ త్రిజిల్' కంటే భిన్నమైన జోనర్‌ను ఎంచుకుని సక్సెస్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది . ఆల్ఫ్రెడ్ ప్రకాష్‌తో కలిసి ఆయన రాసుకున్న స్క్రీన్‌ప్లే సినిమాకు వెన్నెముక. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే బ్యాంక్ రాబరీ సీక్వెన్స్, ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులకు థియేటర్లలో 'గూస్ బంప్స్' తెప్పిస్తాయి. సినిమాలో కొన్ని గ్రామీణ సన్నివేశాలు నెమ్మదించినట్లు అనిపించినా, భావోద్వేగ లోతు (Emotional Depth) ఆ లోటును భర్తీ చేసింది. హీస్ట్ సినిమాల్లో సాధారణంగా ఉండే లాజిక్ మిస్సింగ్ సమస్యలు ఇక్కడ కనిపించవు. దర్శకుడు చేసిన రీసెర్చ్ ప్రతి సీన్‌లోనూ కనిపిస్తుంది.

 

 వన్ మ్యాన్ షో గా

ధనుష్ మరోసారి తనేంటో నిరూపించుకున్నారు. ఒక సాధారణ వ్యక్తిగా, భావోద్వేగాల మధ్య నలిగిపోయే తండ్రిగా, మాస్ యాక్షన్ హీరోగా ఆయన నటన అద్భుతం. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ధనుష్ పండించిన హావభావాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ధనుష్ నటన అద్భుతంగా ఉందంటూ.. అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రశంసిస్తున్నారు..

 

 ధనుష్ కు హిట్ ఖాయమా..?

మమితా బైజు తన పాత్రలో ఒదిగిపోయింది. జయరామ్, సూరజ్ వెంజారమూడు, కేఎస్ రవికుమార్, ఎంఎస్ భాస్కర్ తమ అనుభవంతో కథకు మరింత బలాన్ని చేకూర్చారు. ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణ. ఎమోషనల్ సీన్స్‌లో, యాక్షన్ బ్లాక్స్‌లో ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను ఎలివేట్ చేసింది. తేని ఈశ్వర్ విజువల్స్ 1991 నాటి కాలాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాయి. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా సాగదీసినట్లు అనిపించేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అయితే ధనుష్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రాణం పోసింది.

 

మొత్తానికి 'కర' కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, బలమైన భావోద్వేగాలు ఉన్న ఒక అద్భుతమైన డ్రామా. క్లాస్ , మాస్ ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకునే అంశాలు ఇందులో ఉన్నాయి. ధనుష్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ ఖాయంగా కనిపిస్తోందంటున్నారు సినీ విశ్లేషకలు.ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్‌ని మిస్ అవ్వకూడదనుకుంటే, 'కర' తప్పక చూడాల్సిన చిత్రం అంటున్నారు...