
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో పొంగులేటీ కమలం కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తుంది.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పార్టీ నేతలంతా వరుసగా అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి మరియు బీజేపీలోకి వెళుతున్నారు. ఈ క్రమంలో పొంగులేటి కూడా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతున్నట్టు సమాచారం.