లోక్ సభ ఎన్నికల్లో సీనియర్లం పోటీ చేయం : కేటీఆర్

లోక్ సభ ఎన్నికల్లో సీనియర్లం పోటీ చేయం : కేటీఆర్

 

  • 17 స్థానాల్లో టికెట్ల కోసం పోటీ ఉంది

  • కేసీఆర్ స్టిక్ పట్టుకొని ప్రాక్టీస్ చేస్తుండ్రు

  • తెలంగాణ బలగం పేరుతో సోషల్ మీడియా టీం

  • 31 వేల మందితో  ఏర్పాటు చేస్తున్నం

  •  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో సీనియర్లెవరం పోటీ చేయబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. 17 పార్లమెంటు స్థానాల్లో తీవ్ర పోటీ ఉందని ఆయన చెప్పారు. ఓడిపోయిన ఎమ్మెల్యేలు తిరిగి ఎంపీగా పోటీ చేస్తే సానుభూతి వర్కవుటై గెలుస్తామనుకుంటున్నారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కోలుకుంటున్నారని, ప్రస్తుతం స్టిక్ పట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పారు. ఇవాళ  ( జనవరి 25) ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు.  

త్వరలో తెలంగాణ బలగం పేరుతో సోషల్ మీడియా టీంను ఏర్పాటు చేయబోతున్నట్టు కేటీఆర్ చెప్పారు. ఎన్నికలతో సంబంధం లేకుండా బూత్ స్థాయి నుంచి సమస్యలు, ఇబ్బందులు అన్నీ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. 14 ఎమ్మెల్యే స్థానాల్లో ఓడిపోయామని, పార్టీ నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారిస్తామన్నారు. కొన్ని వర్గాల్లో సర్కారుపై అసంతృప్తి వ్యక్తమవుతోందని అన్నారు. అంతర్జాతీయ వేదికలపైనే సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తున్నామని అబద్ధాలు చెబుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. రైతుబంధు అని చెప్పడంలో ఇబ్బందేమిటని ప్రశ్నించారు. ఫ్రీ బస్సు కారణంగా తొమ్మిది మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.  ఫిబ్రవరి 1తో సర్పంచుల పదవీకాలం ముగుస్తుందని చెప్పిన కేటీఆర్... వారి టెన్యూర్ ను పొడిగించాలని లేదా వెంటనే ఎన్నికలు నిర్వహించాలని అన్నారు