సీనియర్ ఫొటో జర్నలిస్టు విద్యాసాగర్ హఠాన్మరణం

సీనియర్ ఫొటో జర్నలిస్టు విద్యాసాగర్ హఠాన్మరణం

హైదరాబాద్ సిటీ, వెలుగు: సీనియర్ ఫొటో జర్నలిస్టు ఎం.విద్యాసాగర్ (63)  హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం 5.30 గంటలకు గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు సూరారంలోని మల్లారెడ్డి దవాఖానకు తరలించారు. అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. విద్యా సాగర్ కు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నాడు. విద్యాసాగర్ నమస్తే తెలంగాణ దినపత్రికలో సీనియర్ ఫొటోజర్నలిస్టుగా పనిచేసి రిటైర్ అయ్యారు. గతంలో ఉషోదయం, ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఏపీ టైమ్స్, హిందీ మిలాప్ వార్త పత్రికల్లో పని చేశారు.  తెలంగాణ ఫొటోజర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఎ.గంగాధర్, ప్రధాన కార్యదర్శి కె.ఎన్.హరి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు.  విద్యాసాగర్  కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.