బుల్ రంకెలు..ఫస్ట్ టైం 60 వేలు దాటిన సెన్సెక్స్

బుల్ రంకెలు..ఫస్ట్ టైం 60 వేలు దాటిన సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ హిస్టరీలో కొత్త రికార్డ్ నమోదైంది. సెన్సెక్స్ మొదటి సారిగా 60 వేల పాయింట్ల మైలురాయిని దాటింది. నిఫ్టీ కూడా 17 వేల 900 పాయింట్లు దాటింది. రియల్టీ, IT షేర్లు 2 శాతానికి పైగా పెరిగాయి. అదే సమయంలో మెటల్ ఇండెక్స్ ఒక శాతం డౌన్ అయింది. అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. దీంతో ఆసియా మార్కెట్లలోనూ ఆ ప్రభావాలు కనిపిస్తున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 73 రూపాయల 78 పైసల దగ్గర ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ మిడ్ క్యాప్ 16.7శాతం నష్టపోయింది. జీ ఎంటర్ టైన్ మెంట్ షేర్లు లాభపడగా... రిలయన్స్, ITC, వొడాఫోన్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎయిర్ టెల్, ఇన్ఫొసిస్, TCS, విప్రో షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్, HCL టెక్, ఇన్ఫొసిస్, విప్రో షేర్లు టాప్ గెయినర్ల లిస్టులో ఉన్నాయి. JSW స్టీల్, టాటా స్టీల్, హిండాల్కో, SBI, బజాజ్ ఫినాన్స్ టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.