ముంబై: బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం సెషన్‌లో ఓపెనింగ్ లాభాలను కోల్పోయి ఫ్లాట్‌గా ముగిశాయి. ఇండియా సోలార్ ప్రొడక్ట్‌లపై అమెరికా 126శాతం దిగుమతి సుంకం విధించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. సోలార్ సెక్టార్‌లోని కంపెనీల షేర్లు 10 శాతం వరకు పతనమయ్యాయి. ఇంట్రాడేలో 731 పాయింట్లు ర్యాలీ చేసిన సెన్సెక్స్, చివరికి 82,276 వద్ద 50 పాయింట్ల (0.06 శాతం) లాభంతో ముగిసింది. నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 25,482 వద్ద సెటిలయ్యింది.
సెన్సెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, టీసీఎస్, సన్ ఫార్మా, ఎం అండ్ ఎం, మారుతి, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో నిలిచాయి. మరోవైపు రిలయన్స్, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి. సోలార్ కంపెనీల షేర్లు వారీ ఎనర్జీస్ 10శాతం, ప్రీమియర్ ఎనర్జీస్ 6శాతం, విక్రం సోలార్ 5శాతం పడ్డాయి. మొత్తంగా గ్లోబల్‌గా పాజిటివ్ సంకేతాలు ఉన్నప్పటికీ అమెరికా టారిఫ్ నిర్ణయం భారత మార్కెట్లలో ప్రాఫిట్ బుకింగ్‌కు తెర లేపింది.
స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. మెటల్, ఆటో, ఐటీ రంగాలు పాజిటివ్‌గా ట్రేడవ్వగా, టెలికాం, ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీ, రియల్ ఎస్టేట్ రంగాలు బలహీనంగా కదిలాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ఉండగా, అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో ట్రేడయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 90.96 వద్ద ఉంది.
