మార్కెట్లకు జీడీపీ జోష్ .. ఆల్​టైం హైకి సూచీలు

మార్కెట్లకు జీడీపీ జోష్ .. ఆల్​టైం హైకి సూచీలు
  • సెన్సెక్స్​ 1,245.05 పాయింట్లు జంప్​
  •  355 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

ముంబై: బెంచ్‌‌‌‌మార్క్ ఈక్విటీ సూచీలు సెన్సెక్స్,  నిఫ్టీలు శుక్రవారం తమ జీవితకాల గరిష్టాలను తాకాయి. ఒకటిన్నర శాతానికి పైగా ర్యాలీ చేశాయి. జీడీపీ డేటా బాగుండటం,  తాజాగా విదేశీ నిధుల ప్రవాహం పెరగడం ఇందుకు కారణాలు. 30 షేర్ల బీఎస్​ఈ సెన్సెక్స్ 1,245.05 పాయింట్లు  జంప్ చేసి 73,745.35కి చేరుకుంది. ఇంట్రాడేలో ఇది 1,318.91 పాయింట్లు జూమ్ చేసి ఇంట్రా-డే గరిష్ట స్థాయి 73,819.21ని తాకింది. నిఫ్టీ 355.95 పాయింట్లు పెరిగి 22,338.75 వద్ద కొత్త ముగింపు గరిష్ట స్థాయికి చేరుకుంది. 

ఇంట్రాడేలో ఇది 370.5 పాయింట్లు  పెరిగి ఇంట్రా-డే రికార్డు గరిష్ట స్థాయి 22,353.30కి చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ,  ఆటో అమ్మకాల సంఖ్యలు ఈక్విటీ మార్కెట్లలో  జోరును పెంచాయి. సెన్సెక్స్‌‌‌‌ కంపెనీల్లో టాటా స్టీల్‌‌‌‌ 6 శాతానికి పైగా ఎగబాకగా, జేఎస్‌‌‌‌డబ్ల్యూ స్టీల్‌‌‌‌ 4 శాతానికి పైగా పెరిగింది. లార్సెన్ అండ్ టూబ్రో, టైటాన్, మారుతీ, ఇండస్‌‌‌‌ ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్  టాటా మోటార్స్ లాభపడ్డాయి. హెచ్‌‌‌‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్,  టెక్ మహీంద్రా వెనుకబడి ఉన్నాయి.

ఇంటర్నేషనల్​ మార్కెట్లు

ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై, హాంకాంగ్ లాభాలతో స్థిరపడ్డాయి. యూరోపియన్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. గురువారం అమెరికా మార్కెట్లు గ్రీన్‌‌‌‌లో ముగిశాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌ఐఐలు) గురువారం రూ. 3,568.11 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. గురువారం బిఎస్‌‌‌‌ఇ బెంచ్‌‌‌‌మార్క్ 195.42 72,500.30 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 31.65 పాయింట్లు  లాభపడి 21,982.80 వద్దకు చేరుకుంది.  క్రూడ్ బ్యారెల్‌‌‌‌కు 0.82 శాతం పెరిగి 82.58 డాలర్లకు చేరుకుంది.  

 డేటాతో బూస్ట్​

భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2023 చివరి మూడు నెలల్లో ఊహించిన దాని కంటే మెరుగ్గా 8.4 శాతం వృద్ధి చెందింది. గత -- ఒకటిన్నర సంవత్సరాల్లో ఇదే అత్యంత వేగం. మునుపటి మూడేళ్లలో అక్టోబరు–-డిసెంబర్‌‌‌‌లో వృద్ధి రేటు  7.6 శాతం కంటే ఎక్కువగా ఉంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2024 వరకు) జీడీపీ అంచనాను 7.6 శాతానికి పెంచారు. దేశీయంగానూ, బయటి డిమాండ్‌‌‌‌తోనూ పరిశ్రమల ఉత్పత్తి, విక్రయాల్లో తీవ్ర పెరుగుదల కారణంగా భారత తయారీ రంగ వృద్ధి ఫిబ్రవరిలో ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరుకుందని నెలవారీ సర్వే శుక్రవారం వెల్లడించింది. 

పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జనవరిలో 56.5 నుంచి ఫిబ్రవరిలో 56.9కి పెరిగింది. బ్రాండ్​ మార్కెట్‌‌‌‌లో, బిఎస్‌‌‌‌ఇ మిడ్‌‌‌‌క్యాప్ గేజ్ 0.89 శాతం  స్మాల్‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.68 శాతం పెరిగింది. ఇండెక్స్‌‌‌‌లలో, మెటల్ జూమ్ 3.84 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.49 శాతం, బ్యాంకెక్స్ 2.48 శాతం, ఆటో అడ్వాన్స్‌‌‌‌డ్ 2.23 శాతం, ఎనర్జీ 2.14 శాతం, ఆయిల్ అండ్​ గ్యాస్ 2.14 శాతం, కమోడిటీస్ 2.12 శాతం,  పారిశ్రామిక 1.91 శాతం  పెరిగాయి. ఐటీ, టెక్‌‌‌‌లు వెనుకబడ్డాయి. మొత్తం 2,387  షేర్లు పురోగమించగా, 1,451 క్షీణించాయి.  109 షేర్లు మారలేదు.