కోర్టులో కాలు జారి పడ్డ విలియమ్స్‌‌.. టోర్ని నుంచి ఔట్..

కోర్టులో కాలు జారి పడ్డ విలియమ్స్‌‌.. టోర్ని నుంచి ఔట్..
  • కోర్టులో కాలు జారి పడ్డ విలియమ్స్‌‌
  • గాయంతో వింబుల్డన్‌‌ నుంచి ఔట్‌‌

లండన్‌‌‌‌: విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో మోస్ట్‌‌‌‌ గ్రాండ్‌‌‌‌స్లామ్స్‌‌‌‌ (24) రికార్డును సమం చేయాలన్న అమెరికా లెజెండ్ సెరెనా విలియమ్స్‌‌‌‌ కల మరోసారి చెదిరింది. భారీ అంచనాలతో వింబుల్డన్‌‌‌‌ బరిలోకి దిగిన సెరెనా గాయం కారణంగా ఫస్ట్‌‌‌‌ రౌండ్‌‌‌‌లోనే వైదొలిగింది. మంగళవారం రాత్రి సెంటర్ కోర్టులో అలియస్కంద సన్సోవిచ్‌‌‌‌ (బెలారస్‌‌‌‌)తో తలపడిన ఆరో సీడ్ సెరెనా ఫస్ట్ సెట్‌‌‌‌లో 3–-3తో ఉన్నప్పుడు విత్‌‌‌‌డ్రా అయింది. ఐదో గేమ్‌‌‌‌లో సర్వ్‌‌‌‌ చేస్తుండగా బేస్‌‌‌‌లైన్‌‌‌‌ వద్ద కాలు జారి కింద పడింది. దాంతో కుడి కాలికి గాయమైంది. గేమ్‌‌‌‌ తర్వాత మెడికల్‌‌‌‌ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకొని తిరిగి కోర్టులోకి వచ్చింది. కానీ, మరోసారి స్లిప్‌‌‌‌ అయి కిందపడ్డ ఆమె నొప్పి ఎక్కువ కావడంతో మ్యాచ్‌‌‌‌ నుంచి తప్పుకుంది. దీంతో భావోద్వేగానికి గురైన సెరెనా.. కోర్టులోనే కన్నీళ్లు పెట్టుకుంది. ఏడుస్తూనే ఫ్యాన్స్‌‌‌‌కు అభివాదం చేస్తూ  స్టేడియం వీడింది. ఓ గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ టోర్నీలో సెరెనా ఫస్ట్ రౌండ్‌‌‌‌లోనే వెనుదిరగడం ఇదే తొలిసారి.  అంతకుముందు  రోజర్​ ఫెడరర్​తో మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ఫస్ట్ రౌండ్ మ్యాచ్‌‌‌‌లో ఫ్రెంచ్‌‌‌‌ ప్లేయర్​అడ్రియన్‌‌‌‌ మనారినో కూడా సెంటర్ కోర్టులో అదే ప్లేస్‌‌‌‌లో జారిపడి గాయపడి విత్‌‌‌‌డ్రా అయ్యాడు. దాంతో, గ్రాస్‌‌‌‌ కోర్టుల మన్నికపై విమర్శలు వస్తున్నాయి. ఇక, మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో టాప్‌‌‌‌ సీడ్ నొవాక్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌ థర్డ్‌‌‌‌ రౌండ్‌‌‌‌ చేరుకున్నాడు. బుధవారం జరిగిన సెకండ్ రౌండ్ మ్యాచ్‌‌‌‌లో జొకో (సెర్బియా) 6-–3, 6–-3, 6-–3తో కెవిన్‌‌‌‌ అండర్సన్ (సౌతాఫ్రికా)పై ఈజీగా గెలిచాడు. ఇదే రౌండ్‌‌‌‌లో పదో సీడ్‌‌‌‌ డెనిస్ షెపవలోవ్‌‌‌‌ (కెనడా)కు వాకోవర్​లభించింది. విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో సెకండ్ సీడ్ సబలెంకా,  ఏడో సీడ్‌‌‌‌ స్వియాటెక్‌‌‌‌ కూడా మూడో రౌండ్‌‌‌‌లో అడుగు పెట్టారు. సబలెంకా (బెలారస్‌‌‌‌) 4–-6, 6–-3, 6–-3తో బౌల్టర్ (ఇంగ్లండ్)పై, స్వియాటెక్ (పోలెండ్‌‌‌‌) 6-–1, 6–-3తో జ్వొనారెవా (రష్యా)పై గెలిచారు. అయితే, ఐదో సీడ్‌‌‌‌ బియాంకా ఆండ్రెస్కూ (కెనడా) 2–-6,1–-6తో కార్నెట్‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌) చేతిలో ఓడింది.