వెనక నుంచి వచ్చి ముద్దు పెట్టి పారిపోవడమే అతడి పని

వెనక నుంచి వచ్చి ముద్దు పెట్టి పారిపోవడమే అతడి పని

ఒంటరిగా వెళ్తున్న మహిళలే అతని టార్గెట్. వెనక నుంచి వెళ్లడం.. హఠాత్తుగా ముద్దుపెట్టి పారిపోవడం. ఇలా కొన్ని రోజులుగా ఒంటరిగా వెళ్తున్న మహిళలను లైంగికంగా వేధిస్తున్న అతడి ఆట కట్టించారు పోలీసులు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ముంబైలోని పతుంగా రైల్వే స్టేషన్ బ్రిడ్జిపై ఒంటరిగా వెళ్తున్న మహిళలను వెనక నుంచి వెళ్లి హత్తుకుంటాడు. ముద్దుపెడతాడు వాళ్లు ఎదురు తిరిగే లోపే పారిపోతాడు.  ఈ ఘటనను  జనవరి 25న  సీసీటీవి కెమెరా ద్వారా గుర్తించారు పోలీసులు.  అందులో ఓ యువకుడు, తెల్లటి షర్ట్  బ్లూ జీన్స్ వేసుకున్న ఒకతను  యువతి దగ్గరకు వెళ్లి వెనక నుంచి ముద్దు పెట్టుకోవడం కనిపిస్తుంది. షాక్ అయిన ఆ మహిళ ఎదురు తిరిగే లోపే అతను పారిపోయాడు.ఇలా కొన్ని రోజులుగా మహిళలను వేధిస్తున్నట్లు గుర్తించారు. గురువారం ఓ దొంగతనం కేసులో అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే  మహిళలు మాత్రం తమను వేధించారని ఫిర్యాదు చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. మహిళలు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు. ఎవరూ ఫిర్యాదు చేయకుంటే న్యాయపరంగా ముందుకెళ్తామన్నారు పోలీసులు.

see more news

జగిత్యాలలో దారుణం..8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం

నాకు మొగుడొద్దు..టిక్ టాకే ముద్దు