యమునోత్రి ధామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సేవా  కార్యక్రమాలు నిర్వహించాం :  పెరిక సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

యమునోత్రి ధామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సేవా  కార్యక్రమాలు నిర్వహించాం :  పెరిక సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • నమో వందే గోమాతరం జాతీయ అధ్యక్షుడు పెరిక సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌​

హైదరాబాద్, వెలుగు: యమునా పుష్కరాల సందర్భంగా ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని యమునోత్రి ధామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  సేవాకార్యక్రమాలు నిర్వహించామని నమో వందే గోమాతరం జాతీయ అధ్యక్షుడు పెరిక సురేశ్ తెలిపారు. వేలాది మంది భక్తులు వీటిని సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు. యమునా పుష్కరాల్లో దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్న సందర్భంగా స్వామీజీల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు.

యమునోత్రి ధామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మహాయజ్ఞం నిర్వహించడంతో పాటు భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశామని వెల్లడించారు. ఇదే సందర్భంగా ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పవిత్ర క్షేత్రం బద్రీనాథ్ ధామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శ్రీమద్ భాగవత మహాకథ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని వివరించారు.