పేపర్‌ లీకులపై ఫాస్ట్‌-ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు: ఎక్స్‌ వేదికగా ప్రధాని మోదీ ట్వీట్

పేపర్‌ లీకులపై ఫాస్ట్‌-ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు: ఎక్స్‌ వేదికగా ప్రధాని మోదీ ట్వీట్

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థులు కొంత కాలంగా చేస్తున్న నిరసనలు, పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళనలతో  కేంద్రం దిగివచ్చింది. పేపర్‌ లీకులపై ఫాస్ట్‌-ట్రాక్‌ కోర్టుల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధానిక మోదీ గురువారం (జులై 23) ఎక్స్ వేదికగా కీలక ట్వీట్ చేశారు. 

నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మోదీ.  నిందితులకు కఠిన శిక్షలు విధిస్తామని పేర్కొన్నారు. 
యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే ముఖ్యమైనదేమీ లేదని అన్నారు. 

విద్యార్థుల భవిష్యత్తు కోసం తమ ప్రభుత్వం నిరంతరం అవసరమైన చర్యలు తీసుకుంటేనే ఉందని.. అందులో భాగంగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకుని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాట్లు ట్వీట్ చేశారు.  విధ్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.