చెన్నై: ప్రధానమంత్రి నివాసం ముందు నిరసన తెలిపినందుకు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని నిర్బంధించడాన్ని తమిళనాడు సీఎం విజయ్ ఖండించారు. రాహుల్ నిర్బంధం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని మండిపడ్డారు. విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా నిలిచినందుకు రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడం కరెక్ట్ కాదన్నారు.
ఢిల్లీ పరిణామాలపై పార్లమెంట్ బయట ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనకు తమ తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని విజయ్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. నీట్ పరీక్షను దేశంలో పూర్తిగా రద్దు చేయడమే ప్రస్తుత సమస్యకు ఏకైక పరిష్కారమని సీఎం విజయ్ తెలిపారు.
