సేవాలాల్ జయంతిని సెలవుగా ప్రకటించాలి

సేవాలాల్ జయంతిని సెలవుగా ప్రకటించాలి
  • నంగారాభేరి లంబాడీ హక్కుల పోరాట సమితి డిమాండ్

ఖైరతాబాద్, వెలుగు: సేవాలాల్ మహరాజ్ జయంతి రోజు ఫిబ్రవరి 15ను సెలవు దినంగా ప్రకటించాలని నంగారా భేరి లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు ధరావత్ గణేశ్ నాయక్ మాట్లాడుతూ.. ఈ నెల 12లోగా సేవాలాల్ జయంతిని సెలవుగా ప్రకటికంచకపోతే 13న అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు.  

అనంతరం రాష్ట్ర, జాతీయ కమిటీని ప్రకటించారు. సంఘం జాతీయ కమిటీ  అధ్యక్షుడిగా పి. శ్రీనివాస్ నాయక్, రాష్ట్ర అధ్యక్షుడిగా  గణేశ్ నాయక్, రాష్ట్ర ఇన్​చార్జిగా  బానోత్  రంజిత్ నాయక్, కార్యనిర్వహణ అధ్యక్షుడిగా శంకర్ నాయక్, మహిళా అధ్యక్షురాలిగా  అజ్మీరా సుశీల నాయక్ ఎన్నికైనట్లు ప్రకటించారు.