చైల్డ్‌‌‌‌‌‌‌‌ పోర్నోగ్రఫీ కేసులో ఏడుగురు అరెస్ట్‌‌‌‌‌‌‌‌

V6 Velugu Posted on Nov 18, 2021

  • సీబీఐ ప్రతినిధి జోషి వెల్లడి

న్యూఢిల్లీ: ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ చైల్డ్‌‌‌‌‌‌‌‌ పోర్నోగ్రఫీ కేసులో సీబీఐ చేపట్టిన ఆపరేషన్‌‌‌‌‌‌‌‌లో ఏడుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు. ఇందులో రామ్‌‌‌‌‌‌‌‌ గౌతమ్‌‌‌‌‌‌‌‌, సతేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిట్టల్‌‌‌‌‌‌‌‌, పురోషోత్తమ్‌‌‌‌‌‌‌‌లను ఢిల్లీలో అదుపులోకి తీసుకోగా, సురేంద్ర కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌ (ఒడిశా), నిషాంత్‌‌‌‌‌‌‌‌ జైన్‌‌‌‌‌‌‌‌ (నోయిడా), జితేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఝాన్సీ), మోహన్‌‌‌‌‌‌‌‌ కృష్ణ (తిరుపతి)అను అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసినట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో అరెస్ట్‌‌‌‌‌‌‌‌ అయిన నిందితులను బుధవారం అక్కడి కోర్టులో హాజరుపర్చారు. మిగిలిన వారిని ఢిల్లీకి తీసుకొచ్చేందుకు కోర్టును ట్రాన్సిట్‌‌‌‌‌‌‌‌ రిమాండ్‌‌‌‌‌‌‌‌ కోరుతామని వారు తెలిపారు. ఈ కేసులో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, మరికొంత మందిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసే అవకాశం ఉందని చెప్పారు.

Tagged spokesperson, new Delhi, cbi, Joshi, reveal, child pornography, porno case, raids on, cbi latest

Latest Videos

Subscribe Now

More News