
చందుర్తి, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి, మల్యాల మండలాల్లో సోమవారం పిచ్చి కుక్కలు రెచ్చిపోయాయి. ఏడుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. చందుర్తి మండల కేంద్రంలో బత్తుల ధాన్యాలు, దేవయ్య, అక్కనపల్లి కృష్ణరాజు, లింగంపల్లి స్వామిపై ఓ కుక్క దాడి చేసింది.
అలాగే మల్యాలలో రొండి రాజయ్య అనే వ్యక్తితోపాటు మరో ఇద్దరిపై వీధి కుక్క దాడి చేసింది. రాజయ్యకు తీవ్ర గాయాలు కావడంతో వేములవాడ హాస్పిటల్‌కు తరలించారు. మిగిలిన బాధితులు చందుర్తి పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు.