
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం వికటించి ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. కాలుకు సర్జరీ చేసిన వైద్యులు బాలుడికి గుండెపోటు వచ్చిందని చెప్పడంతో మృతుడి బంధువులు దవాఖానా ముందు ఆందోళనకు దిగారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే.? . జహీరాబాద్ ప్రాంతానికి చెందిన బాలుడికి ఐదు నెలలుగా బంజారాహిల్స్ లో ని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో అడ్మిట్ అయిన బాలుడి కాలుకు చీము రావడంతో సర్జరీ చేశారు. దీంతో బాలుడు మృతి చెందాడు.
వైద్యం వికటించే మృతి చెందాడని బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. అయితే బాలుడు గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. కాలుకు చిన్న గాయం అయితే గుండెపోటు ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు బాలుడి తల్లిదండ్రులు, బంధువులు.
►ALSO READ | 40 నెలలుగా రెంటు పెండింగ్.. అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్టేషన్ కార్యాలయానికి తాళం...
బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఆస్పత్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేగానీ నిజానిజాలు బయటపడవు.