మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లాలో దారుణం...ఏడేండ్ల బాలికపై లైంగిక దాడి

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లాలో దారుణం...ఏడేండ్ల బాలికపై లైంగిక దాడి
  •  జడ్చర్ల మండలంలో

జడ్చర్ల, వెలుగు : ఏడేండ్ల బాలికపై పదహారేండ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లాలో మూడు రోజుల కింద జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే... జడ్చర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక మూడు రోజుల కింద తల్లితో కలిసి కట్టెల కోసం గ్రామ శివారులోకి వెళ్లింది. కట్టెలు తీసుకొని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో తల్లి ముందు నడుస్తుండగా... బాలిక కాస్త వెనుకబడింది.

ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన ఓ పదహారేండ్ల బాలుడు బాలిక నోట్లో గుడ్డలు కుక్కి చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పలేదు. చిన్నారి నడిచేందుకు ఇబ్బంది పడడంతో పాటు కడుపులో మంట అని ఏడ్వడంతో తల్లిదండ్రులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లారు.

అక్కడ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేస్తున్న డాక్టర్లకు అనుమానం వచ్చి బాలికను ప్రశ్నించడంతో లైంగిక దాడి గురించి చెప్పింది. దీంతో డాక్టర్లు జడ్చర్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్పీ జానకి జడ్చర్ల పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌కు చేరుకొని వివరాలు సేకరించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ కమలాకర్‌‌‌‌ తెలిపారు. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.