చిరు జల్లులతో చల్లబడిన నగరం

చిరు జల్లులతో చల్లబడిన నగరం

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ దంచికొట్టగా, ఆ తర్వాత వాతావరణం మారిపోయింది. సాయంత్రం 5 గంటల తర్వాత కాప్రా, మల్కాజిగిరి, ఉప్పల్, సికింద్రాబాద్, ముషీరాబాద్, బోయిగూడ, పద్మారావునగర్, బన్సీలాల్ పేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. 

మిగిలిన ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచాయి. అత్యధికంగా కుషాయిగూడలో 10.8 మి.మీ. వర్షం పాతం నమోదైంది. మల్కాజగిరి, సఫిల్​గూడలో 5.3 మి.మీ., ఉప్పల్​లో 5, మౌలాలిలో 4.5, మల్కాజిగిరి సర్కిల్ ప్రశాంత్​నగర్, ఈస్ట్​ ఆనంద్​బాగ్​లో 2.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. శుక్రవారం పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని, వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.