వెబ్​సిరీస్​లో చాన్స్ ఇప్పిస్తానని తీసుకెళ్లి లైంగిక దాడి

వెబ్​సిరీస్​లో చాన్స్ ఇప్పిస్తానని తీసుకెళ్లి లైంగిక దాడి

జూబ్లీహిల్స్, వెలుగు :  వెబ్​సిరీస్​లో చాన్స్ ఇప్పిస్తానని తీసుకెళ్లి ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధురానగర్​ఎస్సై బి.బాలరాజ్ ​తెలిపిన ప్రకారం.. ఏపీకి చెందిన కృష్ణారావు (46) సిటీకి వచ్చి మియాపూర్​లో ఉంటూ..  కారు లోన్లు ఇప్పించే జాబ్ చేస్తుంటాడు.

అతడు మూసాపేటకు చెందిన కనకమహాలక్ష్మి అనే మహిళతో కలిసి ఉంటుండగా.. ఆమెకు ఒక కుమార్తె ఉంది. సినిమాలు, వెబ్​సిరీస్​లు చేయడమంటే ఆ యువతికి ఇష్టం. దీంతో ఆ యువతిని గురువారం రాత్రి అతడు బ్యూటీపార్లర్​కు తీసుకెళ్లి ఫేషియల్ మేకప్ ​చేయించాడు.

దారిలో  కేఎఫ్​సీ రెస్టారెంట్​కు తీసుకెళ్లి తినిపించాడు. ఆపై వెబ్ సిరీస్​లో చాన్స్ వచ్చిందని, డైరెక్టర్​ను కలుద్దామని ఆమెను నమ్మించి మధురానగర్​లోని రూమ్​కు తీసుకెళ్లాడు. రూమ్ లోకి వెళ్లాక యువతిపై అతడు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్​ చేసి విచారిస్తున్నట్టు ఎస్సై బాల్​రాజ్ ​తెలిపారు.