రాహుల్ గాంధీ ఆఫీస్ పై ఎస్ఎఫ్ఐ దాడి

రాహుల్ గాంధీ ఆఫీస్ పై ఎస్ఎఫ్ఐ దాడి

కేరళ రాష్ట్రం వాయనాడ్‌లోని రాహుల్‌ గాంధీ ఎంపీ కార్యాలయంపై ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు దాడి చేశారు. జెండాలు, కర్రలతో రాహుల్ కార్యాలయంలోకి చొచ్చుకొని వచ్చిన ఎస్ఎఫ్ఐ నాయకులు... కార్యాలయంలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు.  ఈ దాడిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దాడిని ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేరళలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మాఫియా ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలో దాడి జరగడం దారుణమన్నారు. ఈ దాడి వెనుక సీపీఎం అగ్రనేతలు ఉన్నట్లు ఆయన ఆరోపించారు. మోడీ దారిలోనే సీపీఎం నడుస్తోందన్న ఆయన... సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి స్పందించాలని కోరారు.