పేద విద్యార్థులకు ఏఐ అందుబాటులోకి తేవాలి.. న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రభీర్ డిమాండ్

పేద విద్యార్థులకు ఏఐ అందుబాటులోకి తేవాలి..  న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రభీర్ డిమాండ్

హైదరాబాద్/ ముషీరాబాద్, వెలుగు: విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఏఐ వంటి ఆధునిక సాంకేతికతను ప్రతి పేద విద్యార్థికి అందుబాటులోకి తేవాలని న్యూస్‌ క్లిక్ ఎడిటర్ ప్రభీర్ పురకాయస్థ కోరారు. ఆదివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ కన్వెన్షన్‌ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టెక్నాలజీని పెట్టుబడిదారులు తమ వ్యాపార ప్రచారాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు.

ఎస్టీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ.. మోదీ సర్కార్‌ ఎన్‌ఈపీ పేరుతో విద్యను కేంద్రీకరణ, వ్యాపారీకరణ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం అధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు ఆదర్శ్‌ ఎం.సజీ, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రజనీకాంత్, టి.నాగరాజు, హైదరాబాద్‌ అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.