హెచ్సీయూలో ఎస్ఎఫ్ఐ జెండా..  ప్రెసిడెంట్గా దిల్షాదా విక్టరీ 

హెచ్సీయూలో ఎస్ఎఫ్ఐ జెండా..  ప్రెసిడెంట్గా దిల్షాదా విక్టరీ 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్ సీయూ) స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ(స్టూడెంట్స్‌‌ ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా), ఏఎస్ఏ ప్యానెల్ ఘన విజయం సాధించారు. ప్రెసిడెంట్ గా ఎస్ఎఫ్ఐ లీడర్ దిల్షాదా గెలుపొందారు. సోమవారం గచ్చిబౌలిలోని హెచ్ సీయూలో స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు జరిగాయి. దీనిలో 5,900 ఓట్లకు గానూ 79 శాతం పోలింగ్ జరిగింది. మంగళవారం ఉదయం నుంచి ఓట్ల కౌంటింగ్ మొదలైంది.

ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, ఎన్ఎస్ యూఐ ప్యానెల్స్ పోటీలో నిలిచాయి. కానీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఏ ప్యానెల్, ఏబీవీపీ, ఎస్ఎల్​వీడీ( సేవలాల్ విద్యార్థి దళ్) మధ్యే హోరాహోరిగా పోరు సాగింది. ప్రెసిడెంట్ గా ఎస్ఎఫ్ఐ ప్యానెల్ ప్రతినిధి దిల్షాదాకు 2,168 ఓట్లు రాగా.. ఏబీవీపీ ప్రతినిధికి 1,717 ఓట్లు వచ్చాయి. దీంతో 451 ఓట్ల మెజార్టీతో దిల్షాదా విజయం సాధించారు. ఎన్ఎస్ యూఐ ప్యానెల్ నుంచి పీడీఎస్ యూ లీడర్ నవీన్ కుమార్ కు 461 ఓట్లు రాగా.. నోటాకు 217 ఓట్లు పోల్ అయ్యాయి.  మరో 55 ఓట్లు ఇన్ వాలిడ్ అయ్యాయి. అర్ధరాత్రి వరకూ ఎస్ఎఫ్​ఐ ప్యానెల్ కు చెందిన సిద్ధాంత్.. ఏబీవీపీ అభ్యర్థి సప్తగిరిపై 311 ఓట్ల మెజార్టీతో జాయింట్ సెక్రటరీగా విజయం సాధించారు. జనరల్ సెక్రటరీగా ఎస్ఎఫ్ఐ ప్యానెల్ నుంచి ప్రతీక్ (ఏఎస్ఏ), వైస్ ప్రెసిడెంట్ నితిన్ చౌహాన్ లీడ్ లో ఉన్నారు. మిగిలిన రెండు పోస్టుల్లో హోరాహోరీగా ఉంది.