జ్యోతిష్యం: తులారాశిలో బుధుడు.. శని కలయిక.. అక్టోబర్ 5న షడాష్టక యోగం.. మూడు రాశుల వారికి అదృష్ట యోగం

జ్యోతిష్యం:  తులారాశిలో బుధుడు.. శని కలయిక.. అక్టోబర్ 5న షడాష్టక యోగం.. మూడు రాశుల వారికి అదృష్ట యోగం

దసరా పండుగ ఉత్సవాలు ముగిశాయి.  ఇప్పుడిప్పుడే సొంతూళ్లకు వెళ్లిన జనాలు నగరానికి వచ్చి మళ్లీ యథావిథిగా వాళ్ల పనుల్లో బిజీ  అవుతున్నారు.  ఇదిలా ఉండగా  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్​ 5 వతేదీన ఉదయం 6 గంటలకు  నవగ్రహాల్లో రెండు ప్రధాన గ్రహాలు  శని.. బుధుడు.. తులారాశిలో కలవడం వలన  షడాష్టక యోగాన్ని ఏర్పడుతుంది.  ఈ యోగం వలన మూడు రాశులవారికి ( మేషం.. కర్కాటకం.. మీన రాశులు) అదృష్ట యోగం పట్టబోతుందని పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆరాశుల వారికి ఎలా ఉంటుంది.. ఏఏ రంగాల్లో శుభ ఫలితాలుంటాయి.. ఇక ఈ రాశుల వారికి కలిగే ఫలితాలను విపులంగా  ఈ స్టోరీలో లో తెలుసుకుందాం. . . 

నవగ్రహాల్లో శని, బుధులు అక్టోబర్ 5వ తేదీ ఉదయం 6 గంటల ప్రాంతంలో ఒకదానికొకటి 150 డిగ్రీల కోణంలో నిలవడం వల్ల షడాష్టక యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో బుధుడు తులా రాశిలో, శని మీన రాశిలో ఉంటారు. ఈ యోగం ముఖ్యంగా దసరా పండుగ అనంతరం ఏర్పడడం విశేషమని పండితులు చెబుతున్నారు. 

శని-బుధుల కలయిక..

శని-బుధుల కలయిక మూడు రాశులవారికి మేలు చేస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు.. మేషం, కర్కాటకం, మీన రాశులకు చెందిన వారు ఈ యోగం ప్రభావంతో సానుకూల మార్పులను అనుభవిస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. షడాష్టక  యోగం వల్ల కెరీర్‌లో ప్రగతి, ఆర్థికాభివృద్ధి,  కలుగుతుందని అంచనా వేస్తున్నారు. . 

మేష రాశి .. షడాష్టక యోగం వలన ఈ రాశి వారికి అన్ని విధాలా బాగుంటుంది.  మేషరాశి జాతకులకు జీవితంలో కొత్త దశ ప్రారంభమవుతుందని జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు.  గతంలో నిలిచిపోయిన పనులు పూర్తి కావడమే కాకుండా.. ఇబ్బందులు తొలగి .. ప్రతి పనిలో కూడా సానుకూల పరిస్థితులు ఏర్పడుతాయి.  బుధుడు.. వ్యాపారానికి  అధిపతి..శని కర్మకు అధిపతి .. తులా రాశి తరాజు కు అధిపతి.. తులారాశిలో బుధుడు.. శని కలయిక వలన వ్యాపారస్తులు గణనీయమైన లాభాలు పొందుతారు.  ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే జాబ్​ లో వారి పరిస్థితులను బ్యాలెన్స్​ చేసుకుంటారు.  ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్​ రావడం.. కొత్త ప్రాజెక్ట్​ లు చేపట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఫలితాలు వస్తాయి.  మొత్తంగా మేష రాశి వారికి ఈ కాలం విజయపథాన్ని చూపిస్తుంది.

కర్కాటక రాశి :  ఈ రాశి వారికి షడాష్టక యోగం వలన ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి.  వ్యక్తిగత జీవితంలో శుభ ఫలితాలతో పాటు.. ఆస్తి, రియల్ ఎస్టేట్ వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.  పూర్వీకుల ఆస్తి కలసి రావడంతో కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడతారు.  ఇక అమ్ముడు పోవు అనుకున్న వస్తువులు.. వెంటనే సేల్​ అవుతాయి. కుటుంబసభ్యల మధ్య వివాదాలు పరిష్కారం కావడంతో సంతోషకరంగా గడుపుతారు.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభిస్తుంది.  బంధువర్గంలోని వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. 

మీన రాశి: ఈ రాశి వారికి బుధుడు.. శని కలవడంతో ఏర్పడిన షడాష్టక యోగం వలన  కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. పూర్వీకుల నుంచి ఆస్తులు లభిస్తాయి. మీ రిలేషన్​ షిప్​  కూడా బాగుంటుంది. వృత్తి, వ్యాపార రంగంలో పెద్ద మేలు కలుగుతుంది . ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయం లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుంది. లైఫ్​ లో సెటిల్​ అయ్యే అవకాశాలున్నాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం  జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.