క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం : జ్యోతి

క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం : జ్యోతి

తొర్రూరు, వెలుగు : ఆటలకు ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తోందని ఎస్‌‌‌‌జీఎఫ్‌‌‌‌ఐ జిల్లా కార్యదర్శి జ్యోతి చెప్పారు. తొర్రూరులోని యతిరాజారావు పార్క్‌‌‌‌లో ఎస్‌‌‌‌జీఎఫ్‌‌‌‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రగ్బీ పోటీలు ఆదివారంతో ముగిశాయి. అండర్‌‌‌‌ 19 బాయ్స్‌‌‌‌ విభాగంలో నల్గొండ ఫస్ట్‌‌‌‌, రంగారెడ్డి సెకండ్‌‌‌‌, గర్ల్‌‌‌‌ కేటగిరీలో మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌, మెదక్‌‌‌‌ సెకండ్‌‌‌‌, అండర్‌‌‌‌ విభాగంలో బాయ్స్‌‌‌‌ కేటగిరీలో నిజామాబాద్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌, నల్గొండ సెకండ్‌‌‌‌, గర్ల్స్‌‌‌‌ కేటగిరీలో మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌, నల్గొండ సెకండ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచాయి.

అనంతరం జ్యోతి మాట్లాడుతూ జిల్లాలో క్రీడల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. క్రీడల అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో మినీ స్టేడియాలను నిర్మిస్తోందన్నారు. కార్యక్రమంలో షూటింగ్‌‌‌‌ బాల్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ రాష్ట్ర కార్యదర్శి, క్రీడా కన్వీనర్‌‌‌‌ చెడుపల్లి ఐలయ్య, రాష్ట్ర పరిశీలకుడు యూసఫ్‌‌‌‌ఖాన్‌‌‌‌, రమేశ్‌‌‌‌, శ్రీనివాస్‌‌‌‌, విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌, సునీల్‌‌‌‌ పాల్గొన్నారు.