స్కూళ్ల సమస్యలు దాచేస్తున్నరు

స్కూళ్ల సమస్యలు దాచేస్తున్నరు
  • మీడియాను, యూనియన్లను లోనికి పోనిస్తలేరు
  • కాంగ్రెస్ నేత షబ్బీర్​ అలీ

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల సమస్యలు బయటకు రాకుండా ఉండేందుకు విద్యాశాఖ  ప్రయత్నిస్తున్నదని పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్​షబ్బీర్​ అలీ అన్నారు. వాటి దయనీయ స్థితిని కప్పిపుచ్చేందుకే ఆయా స్కూళ్లలోకి మీడియా, స్టూడెంట్​యూనియన్లు, ఎన్జీవోలు వెళ్లకుండా నిషేధించారని శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. బీఆర్ఎస్​ప్రభుత్వ హయాంలో సర్కారు స్కూళ్లన్నీ పూర్తిగా నాశనమయ్యాయని విమర్శించారు. 

ఏండ్ల నుంచి రిపేర్లు చేయకపోవడంతో  పెద్ద సంఖ్యలో స్కూళ్లు వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  స్కూల్ బిల్డింగుల పరిస్థితిని తెలుసుకునేందుకు కనీసం సర్వే కూడా చేయించలేదని ఫైర్ అయ్యారు. సమస్యను పరిష్కరించాల్సింది పోయి..బయట ఎవరికి తెలియకుండా అంక్షలు విధించి కవర్ చేద్దామని చూస్తున్నారని మండిపడ్డారు. రిపేర్లు చేయకుండానే రీ ఓపెన్​చేస్తున్న స్కూళ్లతో విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్కూళ్ల రిపేర్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.