
హైదరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్లో మైనార్టీలకు తక్కువ ఫండ్స్కేటాయించారని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ షబ్బీర్ అలీ అసహనం వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే మైనార్టీ స్కీమ్స్‌కు ఫండ్స్తగ్గించారని మంగళవారం ప్రెస్నోట్రిలీజ్చేశారు. 26 కోట్ల మంది మైనార్టీలకు రూ.5,020.50 కోట్లు మాత్రమే కేటాయించారని.. గతేడాదితో పోలిస్తే పెంచింది రూ.674.50 కోట్లేనన్నారు. అంటే సగటున ఒక్కో మైనార్టీకి రూ.193 కేటాయించారని మండిపడ్డారు. ప్రధాని మోడీ రోజూ చెప్పే ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ స్లోగన్ ఏమైందని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్‌కు గతేడాది కంటే రూ.46 కోట్లు తగ్గించారని చెప్పారు. మైనార్టీల సంక్షేమాన్ని బీజేపీ గవర్నమెంట్గాలికొదిలేసిందని, మైనారిటీలను ఈ బడ్జెట్ తీవ్రంగా నిరాశ పరిచిందన్నారు.