పోలీసులను బీఆర్​ఎస్​ నేతలు బెదిరించడం ఏందీ.?: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

పోలీసులను బీఆర్​ఎస్​ నేతలు బెదిరించడం ఏందీ.?: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
  • కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు క్లాసులు పెట్టాలి
  • ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 

షాద్ నగర్, వెలుగు: సమాజంలో పోలీసుల పాత్ర చాలా కీలకమైనదని షాద్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ చెప్పారు. శుక్రవారం ఆయన క్యాంపు ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్లు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయన్నారు. అందరి ముందు ఓ పోలీస్​అధికారిని ‘నీ అంతు చూస్తా’ అంటూ బెదిరించడం సరైన పద్ధతి కాదన్నారు. 

84 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ తన పార్టీ నాయకులకు శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులతో ఎలా నడుచుకోవాలో నేర్పించాలని చెప్పారు. రాష్ట్రంలో విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయని,  తెలిసీ తెలియని వయసులో అసెంబ్లీకి వచ్చి చిల్లర మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని చెప్పారు.