జట్టులోకి తిరిగొచ్చిన లేడీ సెహ్వాగ్.. ఇంగ్లాండ్ వైట్-బాల్ టూర్‎కు భారత మహిళల జట్టు ప్రకటన

జట్టులోకి తిరిగొచ్చిన లేడీ సెహ్వాగ్.. ఇంగ్లాండ్ వైట్-బాల్ టూర్‎కు భారత మహిళల జట్టు ప్రకటన

వచ్చే నెల (జూన్)లో మొదలు కానున్న ఇంగ్లాండ్‌  వైట్-బాల్ టూర్‎కు భారత మహిళల జట్టును బీసీసీఐ అనౌన్స్ చేసింది. టీ20, వన్డేలకు 15 మంది ప్లేయర్లతో కూడిన వేర్వేరు జట్లను గురువారం (మే 15) ప్రకటించింది. ఫామ్ లేమితో జట్టులో స్థానం కోల్పోయిన లేడీ సెహ్వాగ్ షెఫాలి వర్మ దాదాపు ఏడాది తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. పూర్ ఫెర్ఫామెన్స్‎తో జట్టుకు దూరమైన షెఫాలి.. దేశీయ క్రికెట్‌, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‎లో సత్తా చాటి ఇంగ్లాండ్తో తలపడనున్న టీ20 జట్టులో స్థానం దక్కించుకుంది. 

డబ్ల్యూపీఎల్‎లో తొమ్మిది మ్యాచ్‌ల్లో 304 పరుగులు చేసి టోర్నమెంట్‌లో నాలుగో టాప్  స్కోరర్‌గా నిలిచి సెలక్టర్ దృష్టిలో పడింది. టీ20 జట్టులో బీసీసీఐ కీలక మార్పులు చేసింది. ఉమా ఛెత్రిపై వేటు పడగా.. యాస్టికా భాటియా, హర్లీన్ డియోల్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఇటీవల సౌతాఫ్రికా, శ్రీలంకతో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికైన స్నేహ్ రాణా కూడా T20I జట్టులో చోటు దక్కించుకుంది. సయాలి సత్ఘారే టీ20, వన్డే జట్లకు ఎంపికైంది. తెలుగమ్మాయిలు అరుంధతి రెడ్డి, శ్రీ చరణి వన్డే, టీ20 రెండు జట్లలో స్థానం దక్కించుకున్నారు.

కాగా, ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ జూన్ 28న ట్రెంట్ బ్రిడ్జ్‌లో ప్రారంభం కానుండగా.. మిగిలిన నాలుగు మ్యాచ్‌లు బ్రిస్టల్, లండన్, మాంచెస్టర్, బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్నాయి. అనంతరం మూడు మ్యాచ్‌ల ODI సిరీస్ జూలై 16న ప్రారంభం కానుండగా.. సౌతాంప్టన్, లార్డ్స్, చెస్టర్-లె-స్ట్రీట్‌ వేదికగా జరగనున్నాయి.

వన్డే జట్టు: 

హర్మన్‌ప్రీత్(కెప్టెన్), స్మృతి మంధాన, ప్రాతిక రావల్, హర్లీన్ డియోల్, రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, తేజాల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీచరణి, శుచి ఉపాధ్యాయ్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే

టీ20 జట్టు: 

హర్మన్‌ప్రీత్(కెప్టెన్), స్మృతి మంధాన,షెఫాలీ వర్మ, రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీచరణి, శుచి ఉపాధ్యాయ, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే.