ఇర్ఫాన్ కొడుకు డ్యాన్స్ చూసి మురిసిపోయిన షారుఖ్

ఇర్ఫాన్ కొడుకు డ్యాన్స్ చూసి మురిసిపోయిన షారుఖ్

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఈ సినిమాలోని పాటలకు చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మాజీ టీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కొడుకు కూడా జాయిన్ అయ్యాడు. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో డ్యాన్స్ చేస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇర్ఫాన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది.

పఠాన్ సినిమాలోని ఓ పాటను పెట్టగా ఇర్ఫాన్ చిన్న కొడుకు ఫోన్ చేతిలో పట్టుకుని, నవ్వుతూ డ్యాన్స్ చేశారు. దీన్ని వీడియో తీసిన తండ్రి ఇర్ఫాన్. ట్విట్టర్ లో షేర్ చేసి షారుఖ్ ని ట్యాగ్ చేస్తూ.. ఖాన్ సాబ్, నీ లిస్ట్ లో ఇంకో క్యూట్ ఫ్యాన్ యాడ్ అయ్యాడు అని పోస్ట్ చేశాడు. చిన్న పిల్లాడి క్యూట్ డ్యాన్స్ చూసి మురిసిపోయిన షారుఖ్.. రిప్లై కూడా ఇచ్చాడు. అతను నీకంటే చాలా టాలెంటు ఉన్నవాడని.. లిటిల్ పఠాన్ అంటూ ట్వీట్ చేశాడు. దాంతో పాటు ఇర్ఫాన్ షేర్ చేసిన వీడియోను షారుఖ్ రీట్వీట్ చేశాడు.