ICU గా షారుఖ్ ఖాన్ ఆఫీసు

ICU గా షారుఖ్ ఖాన్ ఆఫీసు

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తన ఆఫీసుని కరోనా వార్డుగా మార్చేందుకు అంగీకరించారు. ప్రముఖ హిందూజా ఆస్పత్రికి తన ఆఫీసుని ఇచ్చినట్టు  షారుక్ తెలిపాడు. ముంబైలోని షారుఖ్ ఆఫీస్ ను ICU గా మార్చేశారు. జులై నెలలోనే షారుఖ్ తన ఆఫీస్ ను హిందూజా ఆస్పత్రికి వారికి అప్పగించారు. అది ఇప్పటికి పూర్తి స్థాయి ఐసీయూగా అందుబాటులోకి వచ్చింది. ఇందులో మొత్తం 15 బెడ్స్ ఉన్నాయి. 15 మంది అత్యవసర చికిత్స అవసరం అయిన పేషంట్స్ కు ట్రీట్మెంట్ ను ఇక్కడ అందించవచ్చు. షారుఖ్ ఆఫీస్ ను ICUగా మార్చి వెంటిలేటర్స్ ఆక్సీజన్ నాజల్ ఆక్సీజన్ మెషిన్స్ అక్కడ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్న వారికి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వనున్నట్లు హిందూజా సూపరింటెండ్ తెలిపారు.