అక్కడ భారత్‌కే కాదు.. మాకూ అభిమానులు ఉన్నారు: షాహీన్ ఆఫ్రిది

అక్కడ భారత్‌కే కాదు.. మాకూ అభిమానులు ఉన్నారు: షాహీన్ ఆఫ్రిది

వరల్డ్ కప్ లో అభిమానాలు ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచుకు మరో 20 రోజుల సమయమే ఉంది.. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ తొలిసారి పూర్తి స్థాయిలో భారత్ లో నిర్వహించనున్నారు. ఇక అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ దాయాదుల సమరానికి ఆతిధ్యమిస్తుంది. ప్రస్తుతం అందరి కళ్ళు ఈ మ్యాచు మీదే ఉండగా.. పాకిస్థాన్ స్టార్ బౌలర్ షాహీన్ ఆఫ్రిది ఈ మ్యాచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

అక్కడ మమ్మల్ని కూడా ఆదరిస్తారు

భారత్-పాక్ ఐసీసీ టోర్నీల్లో తలపడినప్పుడూ తటస్థ వేదికలపై ఆడాల్సి వస్తుంది. సాధారణంగా భారత్ ఎక్కడ మ్యాచ్ ఆడితే మన అభిమానులు అక్కడ వాలిపోతారు. ఇక మన దేశంలో మ్యాచ్ జరిగితే స్టేడియం మొత్తం భారత అభిమానులతో నిండిపోతుంది. కానీ అహ్మదాబాద్ లో కొంతమంది ఫ్యాన్స్ మాకు సపోర్ట్ చేస్తారని షాహీన్ చెప్పుకొచ్చాడు. మరి పాకిస్థాన్ ఫ్యాన్స్ ఇక్కడకు తమ జట్టుని సపోర్ట్ చేస్తారా..? లేకపోతే ఇండియా ఫ్యాన్స్ లో పాక్ ని సపోర్ట్ చేసే వారున్నారా అనే విషయం అఫ్రిదికే తెలియాలి. 

కాగా.. గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో లక్షకు పైగా కెపాసిటీ ఉంది. దేశంలో ప్రస్తుతం అతి పెద్ద స్టేడియం ఇదే. వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్, భారత్-పాక్ మ్యాచ్, ఫైనల్ ఇక్కడే జరగనున్నాయి. అక్టోబర్ 14 న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. మరి భారీ అంచానాలు ఉన్న ఈ మ్యాచులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.