ఆషాఢమాసం ప్రారంభం నుంచి మొదలైన వరంగల్ భద్రాకాళి శాకాంబరీ ఉత్సవాలు పౌర్ణమితో ముగిశాయి. బుధవారం చివరి రోజు అమ్మవారు భక్తులకు శాకాంబరిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా 15 క్వింటాళ్లలో 72 రకాల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని అలంకరించారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించారు. ఆయా ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకున్నారు.
-గ్రేటర్వరంగల్/ చండ్రుగొండ, వెలుగు
