పారాచూట్ నుంచి షాంపూలు

పారాచూట్ నుంచి షాంపూలు

హైదరాబాద్​, వెలుగు: ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంసీజీ కంపెనీ మారికో బ్రాండ్​పారాచూట్ షాంపూల విభాగంలోకి వచ్చింది.   అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ ప్రోటీన్ షాంపూ ద్వారా హిందుస్థాన్ యూనిలీవర్ , ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ వంటి ఎంఎన్​సీలతో పోటీ పడనుంది. 

ఏటా 10 శాతం వృద్ధి చెందుతున్న రూ.10 వేల కోట్ల షాంపూ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో భారీ వాటాను దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. 2030  నాటికి రూ.20 వేల కోట్ల ఆదాయాన్ని సాధించాలనే వ్యూహంలో ఇదొక భాగమని మారికో తెలిపింది.