V6 News

నర్కూడలో ఓటుకు రూ.20 వేలు?.. 15 వేల నుంచి 20 వేల వరకు పంచినట్టు ప్రచారం

నర్కూడలో ఓటుకు రూ.20 వేలు?.. 15 వేల నుంచి 20 వేల వరకు పంచినట్టు ప్రచారం

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలో పోటీచేసిన సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు ఏకంగా రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పంచినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. నర్కూడ గ్రామం శంషాబాద్ ఎయిర్​పోర్టుకు దగ్గరగా ఉండడం.. చుట్టు పక్కల రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్కువగా సాగుతుండడంతో గ్రామా నికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నది. 

ఇప్పుడు ఎంత ఖర్చుపెట్టినా తిరిగి వస్తుందనే నమ్మకంతోనే అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడలేదని సమాచారం. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ ​కావడంతో బుధవారం రాత్రంతా గ్రామంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయినప్పటికీ  నాయకులు ఓటర్లకు డబ్బులు చేర్చినట్టు తెలి సింది. 

నర్కూడ గ్రామంలో 4 వేల ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గడ్డం శేఖర్ యాదవ్, బీజేపీ తరఫున నానవల కుమార్ యాదవ్, బీఆర్ఎస్ తర ఫున బుర్కుంట సతీశ్ యాదవ్ బరిలో నిలి చారు. గురువారం జరిగిన ఎన్నికలో మొత్తం 3,426 ఓట్లు పోల్ అయ్యాయి. వీరిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్య్యర్థి 1,431 ఓట్ల మెజార్టీతో గెలిచారు.