పోలీస్ వాహనాల ఫాస్ట్ ట్యాగ్​ల చోరీ .. మూడు కార్లు సీజ్

పోలీస్ వాహనాల ఫాస్ట్ ట్యాగ్​ల చోరీ .. మూడు కార్లు సీజ్
  • క్యాబ్ డ్రైవర్లకు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

శంషాబాద్, వెలుగు: పోలీస్ వాహనాల ఫాస్ట్ ట్యాగ్​లు చోరీ చేస్తున్న వ్యక్తిని శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓల్డ్ సిటీలోని యాకత్ పురకు చెందిన నిస్సార్ అహ్మద్(30) ప్రైవేట్ కానిస్టేబుల్ గా సెలక్ట్ అయ్యి ట్రైనింగ్ లో ఉన్నాడు. తన ఫ్రెండ్​తో కలిసి పోలీస్ వాహనాలకు సంబంధించిన ఫాస్ట్ ట్యాగ్​లు దొంగిలించి, విమానాశ్రయం వద్ద క్యాబ్ డ్రైవర్లకు విక్రయిస్తున్నాడు. ఒక్కో ఫాస్ట్ ట్యాగ్​కు నెలకు రూ.10 వేల చొప్పున తీసుకుంటున్నాడు. 

ఇలా ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డులో నడుస్తున్న మూడు క్యాబ్ లను పోలీసులు సీజ్ చేశారు. క్యాబ్ డ్రైవర్లు ఇచ్చిన  సమాచారంతో నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు సీఐ బాలరాజ్ తెలిపారు.