ఫేక్ కరెన్సీ తయారీ ముఠా అరెస్ట్

ఫేక్ కరెన్సీ తయారీ ముఠా అరెస్ట్
  • రూ.2 లక్షల 9 వేల 400 నకిలీ కరెన్సీ, ల్యాప్ టాప్, ప్రింటర్ స్వాధీనం

శంషాబాద్, వెలుగు : ఫేక్ కరెన్సీ తయారు చేస్తున్న ఇద్దరిని శంషాబాద్ ఎస్​వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నర్సరావుపేట జిల్లా గురజాల మండలానికి చెందిన వెంకటేశ్వర్లు సిటీకి వచ్చి శంషాబాద్ పరిధి వెల్లంకినగర్​లోని బాల ఏసు కాలనీలో ఓ ఇంటిని రెంట్​కు తీసుకున్నాడు. తన ఫ్రెండ్ శ్రీనివాస్​తో కలిసి ఈజీ మనీ కోసం ఫేక్  కరెన్సీ తయారీకి స్కెచ్ వేశాడు. వీరిద్దరు కలిసి రూ.100, రూ.500 నకిలీ నోట్లను తయారు చేశారు.

వాటిని చలామణీ చేసేందుకు బుధవారం శంషాబాద్ లోని రద్దీ ఏరియాలకు వెళ్లారు. అక్కడ నకిలీ నోట్లను చలామణీ చేసేందుకు యత్నించగా.. ఎస్​వోటీ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. రూ.2 లక్షల 9 వేల 400 నకిలీ కరెన్సీ, ల్యాప్​టాప్, ప్రింటర్, స్కానర్, బాండ్ పేపర్లు, సెల్​ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్​ను రిమాండ్​కు తరలించారు.