30న వార్న్‌‌‌‌‌‌‌‌‌‌ అంత్యక్రియలు

30న వార్న్‌‌‌‌‌‌‌‌‌‌ అంత్యక్రియలు

మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌: ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్‌‌‌‌ షేన్‌‌‌‌ వార్న్‌‌‌‌ అంత్యక్రియలు ఈనెల 30న జరగనున్నాయి. ఈ విషయాన్ని విక్టోరియా స్టేట్‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌ డానియెల్‌‌‌‌ అండ్రూస్‌‌‌‌ బుధవారం ప్రకటించారు. వార్న్‌‌‌‌ అంత్యక్రియలను ప్రైవేట్‌‌‌‌ కార్యక్రమంగా నిర్వహిస్తామని క్రికెటర్‌‌‌‌ ఫ్యామిలీ వెల్లడించింది. ఆ తర్వాత మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లో వీడ్కోలు సభను ఏర్పాటు చేయనున్నారు. 1994 యాషెస్‌‌‌‌లో హ్యాట్రిక్‌‌‌‌ తీసిన వార్న్‌‌‌‌.. 2006 బాక్సింగ్‌‌‌‌ డే టెస్ట్‌‌‌‌లో 700 వికెట్ల మైలురాయిని కూడా ఎంసీజీలోనే అందుకున్నాడు. మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌లో పుట్టి అక్కడే  ఇంటర్నేషనల్‌‌‌‌ క్రికెటర్‌‌‌‌గా ఎదిగిన వార్న్‌‌‌‌కు అదే గ్రౌండ్‌‌‌‌లో తుది వీడ్కోలు పలికేందుకు విక్టోరియా స్టేట్‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌ భారీ ఏర్పాట్లు చేస్తోంది.