
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం కర్మ ఫలాలను నిర్దేశిస్తుంది. ఈ గ్రహ వ్యక్తి జాతకంలో ఉన్న స్థానం ఆధారంగా ఆర్థిక పరిస్థితిని నిర్దేశిస్తాడు. శని గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి అతి నెమ్మదిగా కదులుతుంది. ఒక వ్యక్తికి ఎలాంటి ఉద్యోగం రావాలి.. ఆ ఉద్యోగం ఏ స్థితిలో ఉండాలి.. వ్యక్తి జాతకాన్ని శని గ్రహం నిర్దేశిస్తుందని పండితులు చెబుతున్నారు. అందుకే ఉద్యోగంలో కష్టాలు.. నష్టాలు వచ్చినప్పుడు.. శనిభగవానుడికి అభిషేకం చేసి.. నల్ల నువ్వులతో అర్చించి దానం ఇవ్వాలని పండితులు చెబుతుంటారు.
శని గ్రహం ప్రభావం ప్రజలపై ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. శుభ ఫలితాలు రావాన్నా.. అశుభ ఫలితాలు రావాలన్నా.. శనిగ్రహం కీలక పాత్ర పోషిస్తుందని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..జన్మ లగ్న .. జన్మరాశిలో శని గ్రహం రెండు...ఆరు... పది స్థానాల్లో ఉంటే శని దేవుడు ఉద్యోగవిషయంలో అద్భుతమైన ఫలితాలను అందించి... అత్యున్నతమైన స్థానాన్ని కలుగజేస్తాడు.
శనిగ్రహం జన్మరాశిలో పదవ ఇంట్లో సంచరిస్తున్నప్పుడు... చిన్నస్థాయి ఉద్యోగులకు కూడా పెద్దస్థాయి ఉద్యోగులకు లభించే గౌరవం.. సదుపాయాలు కలుగజేస్తాడని పండితులు చెబుతున్నారు. శని చంద్రుడు, కుజుడు, సూర్యుడు, బృహస్పతి, బుధుడు , శుక్రుడు ఈ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు.. ఆ వ్యక్తికి కూడా ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
Also Read : అక్షయ తృతీయ రోజు ఈ ఐదు వస్తువులు కొంటే సంపద పెరుగుతుంది.
వ్యక్తి జాతకంలో శని తన ప్రభావాన్ని చూపించే సమయంలో కొన్ని కష్టాలను కలుగజేస్తాడు. ఆ తరువా శుభ ఫలితాలను ఇస్తాడు. అట్టడుగు స్థాయిలో ఉన్న వారికి కూడా శని దృష్టి మంచిగా ఉన్నట్లయితే అత్యున్నత స్థాయి పొందగలరు. జాతకంలో శని శుభప్రదంగా ఉంటే..చిన్న ఉద్యోగం వచ్చినా.. తరువాత పెద్ద ఉద్యోగం పొందడానికి సహాయపడుతుంది.
శని దేవుడిని ఉద్యోగానికి కారణమైన గ్రహంగా కూడా పరిగణిస్తారు. శని వక్ర దృష్టితో ఉన్నట్లయితే ఆ ప్రభావం కారణంగా, ఉద్యోగంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎవరి జాతకంలో శని మంచి స్థితిలో ఉంటాడో, అలాంటి జాతకులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్యనిపుణులు చెబుతున్నారు.