
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని తన స్వస్థలమైన బారామతిలో జరిగిన సమావేశంలో అస్వస్థతకు గురయ్యారు. పవార్ శనివారం సాయంత్రం తన కుటుంబతో కలిసి విద్యా ప్రతిష్ఠాన్‌లో జరిగిన సమావేశానికి హాజరవుతుండగా, ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు.. పవార్ విశ్రాంతి తీసుకోవాలని సూచించారని పార్టీ వర్గాలు తెలిపాయి. 82 ఏళ్ల పవార్ దీపావళి కోసం బారామతిలో ఉన్నారు.