నల్గొండ పోలీస్ విభాగంలోకి స్నిఫర్, ట్రాకర్ డాగ్స్

నల్గొండ పోలీస్ విభాగంలోకి స్నిఫర్, ట్రాకర్ డాగ్స్

నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ జిల్లా పోలీస్​విభాగంలో ఎక్స్‌ప్లోజివ్స్​ను గుర్తించే రెండు స్నిఫర్(బిట్టు, చింటు), ఒక ట్రాకర్(సోను) డాగ్స్​చేరినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత డాగ్ హాండ్లర్లు ఫకృద్దీన్, సతీశ్, దుర్గాప్రసాద్ గురువారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. శిక్షణ విధానం, శునకాల సామర్థ్యం, ఫీల్డ్​లో అవి పనిచేసే తీరును వివరించారు.

పోలీస్ డాగ్ ట్రైనింగ్ సెంటర్ లో ఇవి 8 నెలలపాటు ప్రత్యేక శిక్షణ పొందాయని ఎస్పీ పేర్కొన్నారు. ఎస్బీ సీఐ రాము, అడ్మిన్ ఆర్ఐ సంతోష్, ఆర్ఎస్సైలు సాయిరాం, సంతోష్, శ్రావణి, అశోక్, హెచ్​సీ కరుణాకర్ తదితరులున్నారు.