హైదరాబాద్లో ఐఏసీసీ సదస్సు

హైదరాబాద్లో ఐఏసీసీ సదస్సు

హైదరాబాద్, వెలుగు: ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) హైదరాబాద్​లో శుక్రవారం డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సు నిర్వహించింది. వంద మందికి పైగా వ్యాపార, సాంకేతిక రంగ నిపుణులు హాజరయ్యారు.

భారత్‌లో ఏఐ డిజిటల్ వృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. ఐఏసీసీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కంట్రోల్ ఎస్ డేటాసెంటర్స్ భాగస్వామ్యంతో సదస్సు జరిగింది.  అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

డేటా కేంద్రాలు, సైబర్ భద్రత, గ్రీన్​ ఎనర్జీ  అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. హైదరాబాద్ నగరం సాంకేతిక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్తులో డిజిటల్ రంగ పెట్టుబడులకు గొప్ప అవకాశాలు ఉన్నాయని వివరించారు.