చెలరేగిన ఢిల్లీ..KKRకు భారీ టార్గెట్

చెలరేగిన ఢిల్లీ..KKRకు భారీ టార్గెట్

ఐపీఎల్‌-2022లో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ఢిల్లీ క్యాపిటిల్స్‌ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరుగుతుంది. టాస్‌ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారభించింది. ఓపెనర్లు పృధ్వీ, వార్నర్ చెరో హాఫ్ సెంచరీలతో చెలరేగారు. డేవిడ్‌ వార్నర్‌(61),పృథ్వీ షా( 51) పరుగులతో టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు. చివర్లో శార్దూల్ అదరగొట్టాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 215 రన్స్ చేసింది. కేకేఆర్‌ బౌలర్లలో నరైన్‌ రెండు వికెట్లు, రస్సెల్‌, వరుణ్‌ చక్రవర్తి, ఉమేశ్‌ యాదవ్‌ చెరో వికెట్‌ సాధించారు.