నన్ను ఎంపీగా చూడాలన్నది చిన్నాన్న ఆఖరి కోరిక - షర్మిల భావోద్వేగం..

నన్ను ఎంపీగా చూడాలన్నది చిన్నాన్న ఆఖరి కోరిక - షర్మిల భావోద్వేగం..

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప ఎంపీగా బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా జరుగుతున్న ప్రచారం కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత నిజమైంది. ఈ మేరకు ఇడుపులపాయ నుండి ప్రకటన చేశారు షర్మిల. ఈ క్రమంలో తొలిసారి ఏపీ రాజకీయాల్లో తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న షర్మిల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను ఎంపీగా చూడాలన్నది చిన్నాన్న వివేకా చివరి కోరిక అని, అప్పట్లో తనకు అర్థం కాలేదని, ఇప్పుడు అర్థమవుతోందని అన్నారు. హత్య రాజకీయాలకు తాను వ్యతిరేకినని, ఒక హంతకుడు పార్లమెంట్ మెట్లు ఎక్కకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.

వివేకాను చంపిన వ్యక్తికి జగన్ ఎంపీ టికెట్ ఇచ్చాడని, అధికారం వాడుకొని హంతకులను రక్షిస్తున్నాడని ఆరోపించారు. హంతకులకు టికెట్ ఇవ్వటం తట్టుకోలేకపోయానని అన్నారు.హత్య చేసినవాళ్లకు శిక్ష లేదని, హత్య చేసినవాళ్లు, చేయించిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారని అన్నారు. అన్ని శాక్ష్యాలు ఉన్నా కూడా వారిపై చర్యలు తీసుకోవట్లేదని అన్నారు. జగన్ అవినాష్ రెడ్డిని వెనకేసుకు రావటం, అతనికి ఎంపీ సీటు ఇవ్వటం తట్టుకోలేకపోయానని అన్నారు షర్మిల.