శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు రూపొందిస్తున్న చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఏకేఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ మూవీ రిలీజ్ డేట్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. సంక్రాంతి సందర్భంగా జనవరి 14 సాయంత్రం 5.49 నుంచి ప్రీమియర్స్‌తో ఈ సినిమా విడుదల కానుందని ప్రకటించారు.
మామూలుగా ఏ సినిమా అయినా ఉదయం లేదా తెల్లవారుజామున షోలతో ప్రారంభమవుతాయి. ఇలా సాయంత్రం ముహూర్తంతో విడుదల చేయడంపై టీమ్ డిఫరెంట్ ప్లానింగ్‌తో వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో శర్వా స్టైలిష్‌గా కనిపిస్తూ, కన్ఫ్యూజ్డ్ ఎక్స్‌ప్రెషన్‌తో, మెడలో పూల దండ, చేతిలో మ్యారేజ్ సర్టిఫికెట్‌తో నిల్చున్నాడు. తన వెనుక సంయుక్త సీరియస్‌గా ఉండగా, సాక్షి వైద్య చేతిలో పూల దండ పట్టుకుని స్మైల్ ఇవ్వడం ఫ్రేమ్‌కి ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది.
మరోవైపు శర్వానంద్ నటించిన శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా కూడా జనవరి 14న విడుదలై సూపర్ హిట్ టాక్‌ను అందుకున్నాయి. మరోసారి ఈ సంక్రాంతికి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని శర్వా చూస్తున్నాడు. భాను బోగవరపు కథను అందించిన ఈ చిత్రానికి నందు సవిరిగాన డైలాగ్స్ రాస్తున్నాడు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నాడు.

